హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొగమంచుపై పోలీస్ కమిషనర్ హెచ్చరిక

NZB: శీతాకాలం నేపథ్యంలో తెల్లవారుజామున రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. అత్యవసరమైతే తప్ప పొగమంచు సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా వాహనాలు నడపాలని కోరారు.