హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన పోటీలు

MLG: విద్యార్థుల్లో ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచాలని ములుగు ఆర్డీవో కృష్ణవేణి సూచించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. 10 మండలాల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఓటరు జాబితా, ఈవీఎంలు, వీవీప్యాట్, పోలింగ్ ప్రక్రియపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు.