హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ నియంత్రికకు తీగజాతి మొక్క

WNP: పట్టణంలోని 29వ వార్డులో కలెక్టర్ పాత నివాస భవనం ప్రహరీ వెనుక ఉన్న విద్యుత్ నియంత్రికను తీగజాతి మొక్క అల్లుకుంది. దాని తీగలు విద్యుత్ పరికరాలకు తగలడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి తీగజాతి మొక్కను తొలగించాలని కోరుతున్నారు.