WNP: రేవల్లీ మండలం కేశంపేట గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఎంపీడీవో అల్లి కీర్తన ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను తనిఖీ చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించి నిజమైన పేదలు, అర్హులకే ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.
తెలంగాణ
నిజమైన పేదలకే ఇళ్లు: ఎంపీడీవో


