SRPT: హుజూర్‌నగర్‌లోని లింగగిరి రోడ్డులో రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న పొట్టు దుమ్ముతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, దుస్తులపై నల్లటి దుమ్ము పేరుకుపోతోందని, చిన్నారులు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్లు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మున్సిపాలిటీ మేనేజర్ అశోక్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
రైస్ మిల్లు దుమ్ముతో ప్రజల అవస్థలు


