హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లిలో 22న మల్టీ పర్పస్ వర్కర్ పరీక్ష

భూపాలపల్లి జిల్లాలో ఆయుష్ శాఖలో మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుల ఎంపిక కోసం ఈ నెల 22న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని జీ-36 కాన్ఫరెన్స్ హాల్‌లో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పోస్టులకు మొత్తం 98 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.