హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాటిచెట్టు పై నుంచి పడ్డ గీత కార్మికుడు

JN: పాలకుర్తి మండలం దద్దపెల్లి గ్రామంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు గిరాగాని సుధాకర్ తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సుధాకర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.