WNP: కొత్తకోట సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సునితారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, జాతీయ రహదారి-44పై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోక్సో కేసులను 60 రోజుల్లో పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
పోక్సో కేసులు 60 రోజుల్లో పూర్తి చేయాలి: ఎస్పీ


