హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుపై సీఎస్ సమీక్ష

HYD: సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 'ఇందిరమ్మ కుటుంబ బీమా' పథకం అమలుపై సమీక్షించారు. ప్రతిగ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి అర్హులందరినీ చేర్చాలన్నారు. ప్రస్తుత వ్యక్తిగతబీమా పథకాలను దీనికింద ఏకీకృతం చేయాలని, విస్తృత ప్రచారం కల్పిస్తూ నిబంధనలు పాటించాలన్నారు.