హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీసర్వే పనులపై తహశీల్దార్ తనిఖీ

SRPT: మోతె మండలం గోపాలపురం గ్రామంలో తహశీల్దార్ ఆకస్మికంగా పర్యటించి భూపట్టాల రీసర్వే పనులను పరిశీలించారు. పంట పొలాల వద్ద సర్వేయర్లు చేపడుతున్న డిజిటల్ కొలతలను తనిఖీ చేసి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.