హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో మంత్రి పర్యటన

SRPT: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి నవంబర్ 19న పంపిణీ చేయనున్నారు. పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. లబ్ధిదారులు హాజరుకావాలని సూచించారు.