హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే దొంతి

WGL: దుగ్గొండి మండలంలో 700 మంది లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.