ADB: బోథ్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కూలీ అంబాజీ శుభకార్యం కోసం గడ్డం, మీసాలు తొలగించడంతో వీబీ జీ రాంజీ యాప్‌లో ఆన్‌లైన్ హాజరు నమోదు కాలేదని మేట్ నరేశ్ తెలిపారు. దీంతో నరేశ్ వినూత్న ప్రయత్నంగా అంబాజీ ముఖానికి పత్తి దూదితో గడ్డం, మీసాలు అమర్చగా హాజరు విజయవంతంగా నమోదైంది. ఆన్‌లైన్ హాజరు కోసం కూలీలు పడుతున్న అవస్థలకు ఇది నిదర్శనంగా నిలిచింది.
తెలంగాణ
ఆన్‌లైన్ హాజరు కోసం గడ్డం, మీసాల స్థానంలో పత్తి దూది!


