హన్మకొండ వేయి స్తంభాల ఆలయాన్ని బుధవారం దేవాదాయశాఖ ఐదో జోన్ డిప్యూటీ కమిషనర్ డి. కృష్ణప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ,విష్ణు ఆలయాల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు దీపారాధన సామగ్రి, మంచినీరు, ప్రసాదం అందించాలని సూచించారు.
తెలంగాణ
భక్తులకు ఏర్పాట్లు చేయాలి: దేవాదాయశాఖ


