హైదరాబాద్: 28°C
తెలంగాణ

20న ములుగు బంద్‌కు పిలుపు

ములుగు మున్సిపాలిటీలో పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న పట్టణ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బుధవారం జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడారు. బంద్‌కు వ్యాపారులు, విద్యాసంస్థలు, ప్రజలు, అఖిలపక్ష నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. పన్నులు తగ్గించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.