హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎగసిపడుతున్న అలలు

KKD: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమైంది. సముద్రంలో అలల ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.