హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

JN: రఘునాథపల్లి, ధర్మసాగర్ మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.20.50 లక్షల విలువైన బంగారం, వెండి, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కోమళ్ల టోల్‌గేట్ వద్ద వాహన తనిఖీల్లో నిందితులు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ACP భీమ్ శర్మ వెల్లడించారు.