E.G: ఈ నెల 26, 29, డిసెంబర్ 2న మూడు దశల్లో జరిగే పంచాయతీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచే మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. పోలింగ్ రోజు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పంచాయతీల పరిధిలో గల ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు, కార్మికులకు సెలవులు ప్రకటించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ పోలింగ్‌కు మద్యం బంద్


