NLR: నెల్లూరులోని ఆదిత్య కళాశాలలో 21వ డివిజన్ కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి, జనసేన నాయకుడు కిషోర్ గునుకుల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాజకీయాల్లో యువత పాత్ర, మహిళల భద్రత, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై చర్చించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, ఉపాధి అవకాశాలు, జాబ్ మేళాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని విజయలక్ష్మి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యువత సమస్యలపై చర్చించిన కార్పొరేటర్


