హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి'

GNTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.