హైదరాబాద్: 28°C
తెలంగాణ

బూడిద లారీల వసూళ్లపై చందర్ ఆరోపణ

PDPL: NTPC ఉచితంగా ఇచ్చే బూడిద తరలించే లారీల నుంచి జిల్లా కలెక్టర్ ఒక్కో ట్రిప్పుకు రూ.500 వసూలు చేస్తున్నారని BRS మాజీ MLA కోరుకంటి చందర్ ఆరోపించారు. మూడేళ్లలో 1.24 లక్షల ట్రిప్పులకు సుమారు రూ.6 కోట్లు వసూలైందని, రసీదులు లేవని ఇవాళ పెద్దపల్లి పార్టీ కార్యాలయంలో చెప్పారు. సొమ్మును యజమానులకు తిరిగివ్వాలని, లేకుంటే CBIకి ఫిర్యాదు చేస్తామన్నారు.