హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్నాప్‌చాట్‌ వేదికగా డ్రగ్స్ దందా

HYD: స్నాప్‌చాట్‌ వేదికగా డ్రగ్స్ దందా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. మణికొండ ల్యాంకో హిల్స్ వద్ద కారులో తరలిస్తున్న 1.24 కిలోల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. 'OGdude420' ఖాతాల ద్వారా సుమారు 900 మంది కస్టమర్లకు వీరు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.