హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో రోడ్డుపక్కన వ్యక్తి.. ఆసుపత్రికి తరలింపు

MBNR: జడ్చర్ల మండలం బూరుగుపల్లి గేట్ సమీపంలోని నాగర్‌కర్నూల్ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 108కు సమాచారం అందించడంతో అంబులెన్స్ సిబ్బంది అతడిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.