హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే

SS: పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన మహా రథోత్సవం భక్తుల సందడితో వైభవంగా సాగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.