హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసికోండి: DSP

W.G: భీమవరం మండలం కరుకువాడ బేతపూడిలో మానవత సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటపతిరాజు, తదితరులు పాల్గొన్నారు.