హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ ఉపసంహరణకు రెండు రోజులు గడువు'

PLD: నరసరావుపేట పురపాలక సంఘం సాధారణ ఎన్నికల్లో ఛైర్మన్, వార్డు అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 18, 19 తేదీల్లో ఉపసంహరించుకోవచ్చని అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత వార్డు ఎన్నికల అధికారుల వద్ద ఉపసంహరణ పత్రాలు సమర్పించాలని సూచించారు.