GDWL: గద్వాల మండలం గోనుపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎదుట ప్రధాన రహదారి కంకర తేలి అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు, పాదచారులు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై ప్రయాణం కష్టతరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
అధ్వానంగా ప్రధాన రహదారి..


