హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన మరుపల్లి మాజీ సర్పంచ్ రామలక్ష్మి

VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామం మాజీ సర్పంచ్ లెంక రామలక్ష్మి వైయస్సార్ సీపీలో చేరారు. బుధవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య రామలక్ష్మితో పాటు ఆమె భర్త సత్యనారాయణకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మండల సురేష్, త్రినాధరావు పాల్గొన్నారు.