హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీలో పౌష్టికాహార పంపిణీ

SDPT: హుస్నాబాద్ పట్టణంలోని 13వ వార్డు అంగన్వాడీ కేంద్రం నంబర్‌–7లో చిన్నారులకు బాలామృతం, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొల్లి శ్రీనివాస్, బూరుగులత పాల్గొని లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేశారు. అంగన్వాడీ టీచర్ ఉప్పల రాజేశ్వరి, ఆయమ్మ పాల్గొన్నారు.