విశాఖ వన్ టౌన్ పరిధిలోని ప్రసాద్ గార్డెన్స్ ఫ్రూట్ మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో 30-40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మురికి నీటిలో నానిపోయి ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడు బ్లూ జీన్స్, చెక్స్ షర్ట్ ధరించి, మెడలో ఆంజనేయస్వామి లాకెట్ కలిగి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం


