హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్‌ల ప్రక్రియ సజావుగా జరగాలి'

ATP: పామిడి మండల కేంద్రంలో జరుగుతున్న రెండో విడత సాధారణ గ్రామ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను బుధవారం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు తనిఖీ చేశారు. నామినేషన్ వేసే గ్రామ సర్పంచ్ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.