W.G: విద్యార్థులు మంచి చెడులను గుర్తించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ పెట్టాలని తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.స్వర్ణ సూచించారు. బుధవారం తణుకు మున్సిపల్ హైస్కూల్ నంబర్-1లో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల అనర్థాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు


