VZM: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని రైతులు అప్రమత్తమయ్యారు. వాతావరణ మార్పుల వల్ల పంట నష్టం వాటిల్లుతుందనే ఆందోళనతో, వారు యంత్రాల ద్వారా వరి నూర్పిడి పనులను ముమ్మరంగా ప్రారంభించారు. ధాన్యాన్ని బస్తాల్లో నింపి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు, తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ భయంతో రైతులు అప్రమత్తం


