హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాసవి ఆలయంలో ఆర్యవైశ్యుల మధ్య ఘర్షణ

GNTR: తెనాలి బోసురోడ్డులోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మరోసారి వివాదం చెలరేగింది. దేవస్థానం–గీతా భవన్ మధ్య గోడ నిర్మాణం విషయంలో ఆర్యవైశ్య ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇప్పటికే దేవస్థానం వ్యవహారాలు కోర్టు వరకు వెళ్లగా తాజా పరిణామం ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.