VSP: ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని 'మిషన్ సాహసి' కార్యక్రమాన్ని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించారు. విద్యార్థినులకు వారం రోజులపాటు స్వీయరక్షణలో శిక్షణ ఇచ్చి, వెయ్యి మందితో ఆత్మరక్షణ నైపుణ్యాలను ప్రదర్శించారు. వెస్ట్ జోన్ ఏసీపీ పి.ప్రదీప్తి పాల్గొని మహిళల భద్రతకు, ఆత్మవిశ్వాసానికి ఇటువంటి శిక్షణలు దోహదపడతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి


