హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సిందే: ఎమ్మెల్యే

NZB: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూచించారు. బుధవారం మిర్చికాంపౌండ్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం భోజనం వడ్డించకపోవడాన్ని గుర్తించి మధ్యాహ్న భోజన నిర్వాహకురాలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.