కోనసీమ: నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజోలు గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి దారపురెడ్డి బాబ్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే దేవ


