KMM: మధిరలో పెన్షన్ల పంపిణీ సభలో బుధవారం మంత్రి శ్రీహరి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. మధిరలో గతంలో ఉన్న 37,477 పెన్షన్లకు అదనంగా 5,317 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామన్నారు.
తెలంగాణ
పెన్షన్ల పంపిణీ సభలో పాల్గొన్న మంత్రి శ్రీహరి


