హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసుల ఆర్థిక సాయం

ELR: ఈ నెల 13న మృతి చెందిన ఏలూరు జిల్లా పోలీస్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వి. గోపి కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు గోపి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఫ్లాగ్ ఫండ్, విడో ఫండ్ చెక్కులతో పాటు పోలీస్ అధికారుల సంఘం తరఫున ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ అందజేశారు.