హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు'

PLD: గత వైసీపీ ప్రభుత్వం రూ.4,271 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందని వినుకొండ ఎమ్మెల్యే, చిప్ విప్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దాదాపు రూ.5 వేల కోట్లు విడుదల చేసి విద్యార్థులకు భరోసా కల్పించిందని పేర్కొన్నారు. జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.