RR: చేవెళ్ల నియోజకవర్గంలోని ఆలూరు గ్రామానికి నిలిపివేసిన ఆర్టీసీ బస్సు సర్వీసును తిరిగి నడపాలని గ్రామస్తులు కోరారు. బుధవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యకు వినతిపత్రం అందించారు. చేవెళ్లలోని పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు, పనుల కోసం రైతులు రోజూ వెళ్తుంటారు. బస్సు లేక ఆలస్యమవుతోందని, ఉదయం 8.30 సర్వీసుతో పాటు మధ్యాహ్నం 2.30, రాత్రి 8.30కి నడపాలని విన్నవించారు.
తెలంగాణ
'ఆలూరుకు ఆర్టీసీ బస్సు కావాలి'


