VKB: తాండూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా చంద్రశేఖర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన కొత్త సీఐకి పోలీసు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయనున్నారు.
తెలంగాణ
తాండూరు రూరల్ కొత్త సీఐ చంద్రశేఖర్


