BPT: చీరాల మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు జరగనున్న సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈపూరుపాలెం, గవినివారిపాలెం, వాడరేవు, తోటవారిపాలెం, చీరాలనగర్, దేవాంగపురి, రామకృష్ణాపురం పంచాయతీ కార్యాలయాల వద్ద అధికారులు మొత్తం 7 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రారంభమైన సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ


