హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ నుంచి నీటి కష్టాలు

HYD: డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో అత్యంత తీవ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రోజుకు 3,200 ఎంఎల్‌డీ అవసరం కాగా 2,600 ఎంఎల్‌డీ మాత్రమే అందుతోంది. సింగూరులో 7 శాతం, మంజీరాలో 17 శాతం నీరే మిగిలింది. నైరుతి రుతుపవనాల వర్షపాతం 458.5 మి.మీ.కే పరిమితమైంది. ఐటీ కారిడార్‌లోని 3.5 లక్షల ఇళ్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.