హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారదర్శకంగా భూ రీ సర్వే చేపట్టాలి: ఆర్డీవో

KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్గంపల్లి గ్రామంలో చేపడుతున్న భూ రీ సర్వే పనులను బుధవారం బాన్సువాడ ఆర్డీవో పరిశీలించారు. తహసీల్దార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే రికార్డులు, భూముల హద్దులు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.