ELR: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏలూరు రూరల్ ఎస్సైలు వి. వెంకటేశ్వరరావు, బి. నాగబాబు సూచించారు. చాటపర్రు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పి. శ్రీనివాస్ శర్మతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్లను డబ్బు, మద్యం వంటి వాటితో ప్రలోభపెట్టడం, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలు ఎన్నికల నిబంధనలు పాటించాలి'


