హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా పంచాయతీ అధికారి తనిఖీలు

BDK: చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామ పంచాయతీలో బుధవారం జిల్లా పంచాయతీ అధికారి అనూష ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్న జలసిరి పనులను పరిశీలించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. అనంతరం విద్యార్థులతో మాట్లడారు.