SRD: సిర్గాపూర్ మండల పరిధిలోని పోచాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను (MPUPS) ఎంఈఓ నాగారం శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను పరిశీలించి, విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను (FLN) స్వయంగా పరీక్షించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి బోధించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
విద్యార్థుల కనీస సామర్ధ్యాలు పరిశీలన


