హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన చేయూత పింఛన్ల పంపిణీ

RR: జిల్లేడు చౌదరిగూడెం మండలంలో నూతనంగా మంజూరైన చేయూత సామాజిక భద్రతా పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లబ్ధిదారులకు అందజేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ దశలవారీగా పింఛన్లు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో వచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.