హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలి: బీజేపీ

RR: మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములను బీజేపీ బృందం పరిశీలించింది. 150 ఎకరాల్లోని లెనిన్ నగర్, స్టాలిన్ నగర్ వంటి బస్తీల ప్రజలను ఖాళీ చేయించకుండా వారి ఇళ్లను వెంటనే క్రమబద్ధీకరించాలని బీజేపీ నేత రాంచందర్ రావు డిమాండ్ చేశారు. మిగిలిన 400 ఎకరాలను వేలం వేసి రూ. 20 వేల కోట్లు రాబట్టే ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.